తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పౌర' సెగ: రణరంగంలా ఈశాన్య భారతం

cab protests
రణరంగంలా అసోం- నిరసనకారుల విధ్వంసకాండ

By

Published : Dec 12, 2019, 1:15 PM IST

Updated : Dec 12, 2019, 4:47 PM IST

16:46 December 12

రాజకీయ పార్టీల కార్యాలయాలపై దాడులు

గువహటి అంబారీ ప్రాంతంలోని అసోం గణపరిషత్ పార్టీ ప్రధాన కార్యాలయంపై నిరసనకారులు దాడి చేశారు. బయట నిలిపి ఉంచిన వాహనాలను ధ్వంసం చేశారు. 

15:52 December 12

ఎమ్మెల్యే ఇంటికి నిప్పు

అసోం చబౌలో ఆందోళనకారులు హింసకు పాల్పడ్డారు. ఎమ్మెల్యే వినోద్ హజారికా ఇంటికి నిప్పుపెట్టారు. వాహనాలు తగలబెట్టారు. 

15:14 December 12

శాంతించండి!

అసోంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ స్పందించారు. అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. 

14:53 December 12

ఆంక్షలు పొడిగింపు

అసోంలోని 10 జిల్లాల్లో అంతర్జాల సేవల్ని మరో 48 గంటలపాటు నిలిపి ఉంచనున్నట్లు అధికారులు ప్రకటించారు. సామాజిక మాధ్యమాల దుర్వినియోగాన్ని అరికట్టి, శాంతిభద్రతలు పరిరక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

పౌరసత్వ బిల్లుపై తీవ్ర నిరసనల నేపథ్యంలో బుధవారం రాత్రి 7 గంటలకు అసోంలోని 10 జిల్లాల్లో అంతర్జాల సేవలు నిలిపివేశారు. 

14:28 December 12

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసు శాఖలో కీలక మార్పులు చేసింది అసోం ప్రభుత్వం. అదనపు డీజీపీ ముకేశ్​ అగర్వాల్​ను సీఐడీకి బదిలీ చేసింది. ఆయన స్థానంలో జీపీ సింగ్​ను నియమించింది. 

14:01 December 12

పోలీసుల కాల్పుల్లో నలుగురికి గాయాలు

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. అసోం గువహటి లాలౌన్‌గావ్‌ ప్రాంతంలో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లదాడి చేశారు. దీనితో పోలీసులు గాల్లోకి కాల్పులు  జరిపారు. ఈ ఘటనలో నలుగురు నిరసనకారులు గాయపడ్డట్లు తెలుస్తోంది. 

గాల్లోకి కాల్పులు..

గువహటిలో నిరవధిక కర్ఫ్యూ విధించినప్పటికీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు గువహటి-షిల్లాంగ్​ రహదారి వెంబడి పలు దుకాణాలను ధ్వంసం చేశారు. టైర్లకు నిప్పుపెట్టారు. అప్రమత్తమైన సైన్యం గువహటి, దిబ్రూగడ్, జోర్హాత్, తిన్‌సుకియా ప్రాంతాలలో ఫ్లాగ్ మార్చ్ చేపట్టింది. పలుప్రాంతాల్లోనూ నిరసనకారులను చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపింది. 

బలగాల మోహరింపు..

ఆందోళనలు మరింత ఉద్రిక్తం అవుతుండడం వల్ల ముందు జాగ్రత్త చర్యగా అసోంకు ఐదు కంపెనీల సైనిక బలగాలను, త్రిపురకు మూడు కంపెనీల అసోం రైఫిల్స్  బలగాలను తరలించారు . 

వంచించారు..

కర్ఫ్యూ కొనసాగుతున్నప్పటికీ అఖిల అసోం విద్యార్థి సంఘం, క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి ఆందోళనలకు పిలుపునిచ్చాయి. డిసెంబర్​ 12ను బ్లాక్​ డేగా ప్రకటించాయి. ప్రధాని మోదీ, అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్​లు పౌరసత్వ సవరణ బిల్లును తెచ్చి అసోం ప్రజలను వంచించారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. 

వామపక్ష పా‌ర్టీలు డిసెంబర్ 19న పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళన చేపట్టాలని నిర్ణయించాయి.  

13:13 December 12

అసోంలో నిరసనకారులపై పోలీసుల కాల్పులు

పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఈశాన్య భారతంలో జరుగుతున్న ఆందోళనలు హింసాయుతంగా మారాయి. అసోం రాజధాని గువహటిలోని లాలుంగావ్​ ప్రాంతంలో నిరసనకారులపైకి పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం.

Last Updated : Dec 12, 2019, 4:47 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details