తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పుట్టినరోజున 'సర్దార్'​​ డ్యామ్​కు మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్​ 17న గుజరాత్​లోని​ సర్దార్​ సరోవర్​ జలాశయాన్ని సందర్శించనున్నారు. ఆ రోజు డ్యామ్​ పూర్తి స్థాయి నీటిమట్టంతో కళకళలాడనుంది. ఈ మైలురాయిని చూసేందుకు మోదీ వెళ్లనున్నారు.

By

Published : Sep 15, 2019, 1:04 PM IST

Updated : Sep 30, 2019, 4:44 PM IST

పుట్టినరోజున 'సర్దార్'​​ డ్యామ్​కు మోదీ

పుట్టినరోజున 'సర్దార్'​​ డ్యామ్​కు మోదీ

గుజరాత్​ రాష్ట్రానికి జీవనాధారంగా పిలుచుకునే సర్దార్​ సరోవర్​ డ్యామ్​ ఈ నెల 17న గరిష్ఠ నీటిమట్టానికి చేరుకోనుంది. ప్రస్తుత నీటిమట్టం 138.68 మీటర్లకు చేరుకుందని రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ తెలిపారు. మరో 68 సె.మీ చేరుకుంటే పూర్తి స్థాయి నీటిమట్టం మార్క్​ను అందుకుంటుంది.

ఈ సందర్భంగా జలాశయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారంసందర్శిస్తారని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే ఆరోజు మోదీ పుట్టినరోజు కావడం మరో విశేషం.

"ఎన్నో ఏళ్ల కృషి తర్వాత నర్మదా నది పైన సర్దార్​ వల్లభాయి పటేల్​ డ్యామ్​ నిర్మాణం కల సాకారమైంది.జలాశయాన్ని నిండుకుండలా చూడాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకున్నారు.అది త్వరలోనే నెరవేరనుంది." -విజయ్​ రూపానీ,గుజరాత్​ సీఎం

1961 ఏప్రిల్​ 5న దేశ తొలి ప్రధాని జవహర్​లాల్​ నెహ్రూ చేతులమీదుగా ఈ డ్యామ్​కు పునాది రాయి పడింది. అయితే ఇది పూర్తయ్యేసరికి 56 ఏళ్లు పట్టింది. గుజరాత్, మధ్యప్రదేశ్​ రాష్ట్రాల మధ్య నర్మదా నది నీరు, విద్యుత్ పంపకాలపై ఎన్నో ఏళ్లు వివాదం నడిచింది. ఎట్టకేలకు 2017లో ఈ ఆనకట్ట నిర్మాణం పూర్తయింది. ప్రధాని మోదీ ఈ డ్యామ్​ను జాతికి అంకితం చేశారు.

131 పట్టణ కేంద్రాలు, 9,633 గ్రామాలకు ఈ ఆనకట్ట ద్వారా నీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది గుజరాత్​ సర్కారు. అలాగే 15 జిల్లాల్లోని వ్యవసాయ క్షేత్రాలకు నీరు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Last Updated : Sep 30, 2019, 4:44 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details