తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీలో ఇళ్ల పథకానికి నేడు మోదీ శ్రీకారం - ఉత్తర ప్రదేశ్‌

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ (పీఎంఏవై-జీ) పథకం కింద ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రానికి రూ.2691 కోట్లు విడుదల చేయనున్నారు. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

PM to release Rs 2,691 crore to 6.1 lakh beneficiaries of housing scheme in UP
ఉత్తర ప్రదేశ్​కి రూ.2691కోట్లు విడుదల చేయనున్న మోదీ

By

Published : Jan 20, 2021, 5:28 AM IST

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ పథకంలో భాగంగా రూ.2,691 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం విడుదల చేయనున్నారు.

6.1 లక్షల మందికి లబ్ధి..

ఈ నిధులతో యూపీలోని 6.1 లక్షల మంది గ్రామీణ పేదలకు లబ్ధి చేకూరనుంది. మొదటి విడతలో 5.30 లక్షలు, రెండవ విడతలో 80 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్టు పీఎంఓ తెలిపింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 1.26 కోట్ల ఇళ్లు నిర్మించినట్టు పేర్కొంది.

2022 నాటికి అందరికీ పక్కా గృహాలు అందించాలనే లక్ష్యంతో 2016 నవంబర్​లో మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. దీని కింద మైదాన ప్రాంతాల్లోని లబ్ధిదారులకు 100శాతం గ్రాంట్​గా రూ.1.20 లక్షలు, కొండప్రాంతాలు, ఈశాన్యరాష్ట్రాలు, జమ్ముకశ్మీర్, నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో రూ 1.30 లక్షలు అందిస్తారు.

ఇదీ సంగతి:ఆరు దేశాలకు భారత్​ టీకాలు..మోదీ హర్షం

ABOUT THE AUTHOR

...view details