రెండు రోజుల పాటు తన సొంత రాష్ట్రమైన గుజరాత్లో పర్యటించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అహ్మదాబాద్‌లో మొదటిదశ మెట్రోసేవలను ప్రారంభిస్తారు. పర్యటనలో భాగంగా శ్రమయోగి మాన్‌ధన్ పథకానికి శ్రీకారం చుడతారు. రాష్ట్రంలో పలు చోట్ల ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేస్తారు.
జామ్‌నగర్ నుంచి మొదలు
రెండు రోజుల పర్యటనను సౌరాష్ర్ట ప్రాంతంలోని జామ్‌నగర్ నుంచి ప్రారంభించనున్నారు నరేంద్ర మోదీ. అక్కడ 750 పడకల గురుగోవింద్ ఆసుపత్రిని ప్రారంభించి జాతికి అంకితమివ్వనున్నారు. దీంతో పాటు పలు ఎత్తిపోతల పథకాల నిర్మాణాలను ప్రారంభిస్తారు.
జామ్నగర్లోనే రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు మోదీ. అలాగే బంద్రా-జామ్‌నగర్... హంసఫర్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అహ్మదాబాద్‌లోని ఉమియాధామ్ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ భవన సముదాయ నిర్మాణ పనులను ప్రారంభిస్తారు.