నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసింది. ధరల పెరుగుదల అంశంపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు మార్గ సూచీ ప్రకటించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా కేంద్రాన్ని కోరారు. దేశంలో ఆహారపదార్థాల ధరల పెరుగుదలపై ప్రధాని నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. ద్వేషం, విభజన అంశాలతో మోదీ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. దేశాభివృద్ధిపై ప్రధాని దృష్టిసారించాలని ట్విట్టర్లో సూచించారు సుర్జేవాలా.