తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"మోసగాళ్ల కోసం మోదీ కొత్త పథకం" - modi

నీరవ్​ మోదీ లండన్​లో ఉన్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్​ పార్టీ విమర్శనాస్త్రాలు సంధించింది. పరారీలో ఉన్న నేరగాళ్ల కోసం ప్రధాని నరేంద్ర మోదీ 'మోసగాళ్లు విదేశాల్లో స్థిరపడే పథకం' నడుపుతున్నట్లు ఎద్దేవా చేసింది.

రణ్​దీప్​ సుర్జేవాలా

By

Published : Mar 10, 2019, 7:50 AM IST

Updated : Mar 10, 2019, 9:18 AM IST

పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ కుంభకోణం నిందితుడు నిరవ్​ మోదీ బ్రిటన్​లో తలదాచుకుంటున్నాడన్న వార్తాల నేపథ్యంలో భాజపాపై కాంగ్రెస్​ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. బ్యాంకుల నుంచి 23 వేల కోట్లు దోచుకుని ఎలాంటి అడ్డంకులు లేకుండా నిరవ్​ దేశం నుంచి పరారయ్యాడని కాంగ్రెస్​ ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా పేర్కొన్నారు.

నిరవ్​ 75 కోట్ల భవనంలో ఉంటూ, రూ.10 వేల జాకెట్​ వేసుకుంటున్నాడని ఆరోపించారు. ఆర్థిక నేరగాళ్లు విదేశాల్లో స్థిరపడే పథకాన్ని ప్రధాని మోదీ నడుపుతున్నారంటూ సుర్జేవాలా ట్వీట్​ చేశారు.

ఇదీ చూడండీ...'ఇద్దరు మోదీలకు భేదం లేదు'

Last Updated : Mar 10, 2019, 9:18 AM IST

ABOUT THE AUTHOR

...view details