రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాటలపై ప్రతిస్పందించారు కాంగ్రెస్ లోక్సభ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలను మభ్యపెట్టిన విధంగానే ఇప్పుడూ ప్రవర్తిస్తున్నారని ఆరోపించింది.
ప్రధానిపై తమ పార్టీ గొప్ప విజయం సాధించిందన్నారు అధిర్ చౌదరి. మోదీ ప్రసంగం చివరి వ్యాఖ్యల్లో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మాటలను ఉటంకించడంపై ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు చౌదరి.