దీపావళి వేడుకలను భారత సైనికులతో జరుపుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్దగల ఆర్మీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని సైనికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మిఠాయిలు అందచేశారు. సరిహద్దులోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
పదాతిదళ దిన వేడుకల్లో..
1947లో భారత బలగాలు జమ్ముకశ్మీర్‌లో తొలిసారి అడుగుపెట్టిన రోజును పురస్కరించుకుని నిర్వహించే 'పదాతిదళ రోజు' వేడుకల్లో పాల్గొన్నారు మోదీ.
ఆర్టికల్ 370 అనంతరం..
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు చేసిన అనంతరం తొలిసారి ఈ ప్రాంతంలో పర్యటించారు మోదీ. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సైనికులతో దీపావళి వేడుకలు జరుపుకునేందుకు జమ్ముకశ్మీర్‌కు మోదీ రావటం ఇది మూడోసారి.
2020లో దీపావళి వేడుకల కోసం హిమాచల్ ప్రదేశ్‌లోని ఐటీబీపీ శిబిరానికి వెళ్లనున్నారు మోదీ.
జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
ఇదీ చూడండి: 'అయోధ్య తీర్పు'పై ప్రధాని కీలక వ్యాఖ్యలు