తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు తొలి ప్రధాని వర్ధంతి.. నివాళులర్పించిన మోదీ - first prime minister news

నేడు దేశ తొలి ప్రధాని పండిట్​ జవహర్​లాల్​ నెహ్రూ 56వ వర్ధంతి. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ కూడా.. నెహ్రూ సేవల్ని గుర్తుచేసుకున్నారు.

PM pays tributes to Jawaharlal Nehru on his death anniversary
తొలి ప్రధాని వర్ధంతి.. మోదీ నివాళి

By

Published : May 27, 2020, 10:07 AM IST

Updated : May 27, 2020, 10:18 AM IST

స్వాతంత్య్రోద్యమంలో కీలకంగా వ్యవహరించి.. దేశానికి తొలి ప్రధానిగా పనిచేసిన పండిట్​ జవహర్​లాల్ ​నెహ్రూ 56వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ నివాళులు అర్పించారు.

మోదీ ట్వీట్​

''వర్ధంతి సందర్భంగా.. పండిట్​ జవహర్​లాల్ నెహ్రూకు నివాళులు అర్పిస్తున్నా.''

- నరేంద్ర మోదీ, భారత ప్రధాని

కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ, పార్టీ సీనియర్​ నాయకులు నెహ్రూ వర్ధంతి సందర్భంగా.. నివాళులు అర్పించారు. ఆయన సేవల్ని స్మరించుకున్నారు. నెహ్రూ.. ఎంతో మందిలో ప్రేరణ కల్పించారని అన్నారు రాహుల్​.

రాహుల్​ గాంధీ ట్వీట్​
కాంగ్రెస్​ ట్వీట్​
జైరాం రామేశ్​ ట్వీట్​

1947 ఆగస్టు నుంచి 1964 మే వరకు నెహ్రూ.. భారత ప్రధానిగా సేవలందించారు. 1964 మే 27న మరణించారు. ఆయన పుట్టిన రోజును (నవంబర్​ 14) ఏటా బాలల దినోత్సవంగా కూడా జరుపుకుంటారు.

Last Updated : May 27, 2020, 10:18 AM IST

ABOUT THE AUTHOR

...view details