తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భూటాన్​కు బయలుదేరిన ప్రధాని మోదీ - జిగ్మే ఖేసర్ వాంగ్​చుక్​

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.... రెండోసారి అధికారం చేపట్టాక తొలి విదేశీ పర్యటన చేపడుతున్నారు. పొరుగుదేశం భూటాన్​కు బయలుదేరారు మోదీ. రెండురోజుల పాటు ఆ దేశంలో పర్యటిస్తారు.

నేడు భూటాన్​ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ

By

Published : Aug 17, 2019, 8:10 AM IST

Updated : Sep 27, 2019, 6:22 AM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు భూటాన్​ పర్యటనకు బయలుదేరారు. రెండోసారి అధికారం చేపట్టిన తరువాత... మోదీ విదేశీ పర్యటనకు వెళ్లడం ఇదే మొదటిసారి.

ప్రధాని ఇవాళ, రేపు పొరుగుదేశం భూటాన్​లో పర్యటిస్తారు. ఆ దేశ రాజు జిగ్మే ఖేసర్​ వాంగ్​ చుక్​, ప్రధాని లోటే షేరింగ్​తో సమావేశమవుతారు.

వ్యూహాత్మక భాగస్వామ్యులైన భారత్​-భూటాన్​... ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే దిశగా చర్చించనున్నట్లు విదేశాంగశాఖ తెలిపింది. ప్రధాని పర్యటన... నమ్మకమైన మిత్రదేశంతో సంబంధాలకు భారత్​ ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనమని పేర్కొంది.

మోదీ మొదటిసారి ప్రధాని పీఠం అధిరోహించిన తరువాత కూడా.. తొలి విదేశీ పర్యటన భూటాన్​లోనే కావడం విశేషం.

ఇదీ చూడండి: జలవిలయానికి 5 రాష్ట్రాలు కకావికలం

Last Updated : Sep 27, 2019, 6:22 AM IST

ABOUT THE AUTHOR

...view details