తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాష్ట్రపతి పుట్టినరోజు- మోదీ, వెంకయ్య శుభాకాంక్షలు - కోవింద్​కు ప్రధాని శుభాకాంక్షలు

రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ 75వ జన్మదినం సందర్భగా గురువారం ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

ramnath
రాష్ట్రపతికి వెంకయ్య నాయుడు, ప్రధాని శుభాకాంక్షలు

By

Published : Oct 1, 2020, 9:48 AM IST

రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ పుట్టినరోజును పురస్కరించుకొని గురువారం ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా సహా పలువురు నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

"రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన తెలివి తేటలు, అర్థం చేసుకునే విధానం మన దేశానికి గొప్ప ఆస్తి. పేదలకు సేవ చేయాలని ఆయన ఎప్పుడూ తపిస్తూ ఉంటారు. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలి."

- నరేంద్ర మోదీ, ప్రధాని

"రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు జన్మదిన శుభాకాంక్షలు. నిరాడంబరత, ముందుచూపు, తిరుగులేని నాయకత్వానికి ఆయన పెట్టింది పేరు. ఆయన మరింత ఆరోగ్యంగా ఉండాలి".

- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి

ఆయన నాయకత్వం ఎప్పుడూ ప్రేరణిస్తుందని అమిత్​ షా కొనియాడారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా మరికొందరు నాయకులు రాష్ట్రపతికి ట్విట్టర్​ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

రామ్​నాథ్​ కోవింద్​ 1945లో ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లోని ఓ గ్రామంలో జన్మించారు. 2017, జులైలో ఆయన రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు.

ABOUT THE AUTHOR

...view details