తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రభుత్వం ఏర్పాటుపై రాష్ట్రపతిని కలవనున్న మోదీ - PRSIDENT

నూతన ప్రభుత్వం ఏర్పాటుపై రాత్రికి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను కలవనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.

ప్రభుత్వం ఏర్పాటుపై రాష్ట్రపతిని కలవనున్న మోదీ

By

Published : May 25, 2019, 4:16 PM IST

నూతనంగా ఎన్నికైన ఎంపీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని కోరేందుకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను ఈరోజు 8 గం.లకు కలుస్తారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.

సాయంత్రం 7 గం.లకు ఎన్డీఏ నేతలు రాష్ట్రపతితో సమావేశమవుతారు.

సార్వత్రిక ఎన్నికల్లో 303 ఎంపీ స్థానాల్లో గెలుపొంది అద్భుత విజయం సాధించింది భాజపా. స్పష్టమైన మెజారిటీతో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

వచ్చే వారం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విదేశీ ప్రతినిధులను ఆహ్వానంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికారిక వర్గాలు తెలిపాయి.

2014లో ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సార్క్​ దేశాల అధినేతలు హాజరయ్యారు.

ఇదీ చూడండి: 17వ లోక్​సభకు రికార్డు స్థాయిలో 'నారీ శక్తి'

ABOUT THE AUTHOR

...view details