తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వివిధ శాఖల పనితీరుపై ప్రధాని మోదీ సమీక్ష

రెండోసారి అధికారంలోకి వచ్చి 6 నెలలవుతున్న నేపథ్యంలో మంత్రిత్వశాఖల పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు. ఈ సమావేశంలో వ్యవసాయం, గ్రామాల అభివృద్ధి, పౌరచట్టంపై దేశ వ్యాప్త ఆందోళనలు చర్చకు వచ్చినట్లు సమచారం.

PM Modi reviews ministries' performance in last 6 months
వివిధ శాఖల పనితీరుపై ప్రధాని మోదీ సమీక్ష

By

Published : Dec 21, 2019, 4:01 PM IST

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 6 నెలల్లో వివిధ శాఖల్లో జరిగిన కార్యక్రమాలపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు. వ్యవసాయం, గ్రామాల అభివృద్ధి, సామాజిక రంగాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.

కేబినెట్‌, స్వతంత్ర హోదా, సహాయ మంత్రుల పనితీరును ప్రధాని తెలుసుకున్నారు. పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు మోదీ. పౌరసత్వ చట్టం, ఎన్‌ఆర్‌సీ వ్యవహారాలకు సంబంధించి ఆందోళనలపైనా ఈ భేటీలో మంత్రులతో చర్చించినట్లు తెలుస్తోంది.

సాధారణంగా ప్రతి నెలా కేబినెట్ సమావేశం తర్వాత కౌన్సిల్‌ సమావేశం జరుగుతోంది. కానీ ఈ సమావేశం స్వతంత్రంగా జరుగుతోందని అధికారులు తెలిపారు. డిసెంబర్‌ 24న కేబినెట్‌ సమావేశం జరగుతుందని వెల్లడించారు.

ఇదీ చూడండి:ఆస్ట్రేలియాలో భీకర కార్చిచ్చు.. 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details