తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నవభారత్​ నిర్మాణానికి మార్గం ఈ బడ్జెట్​'

నవ భారత్​ నిర్మాణానికి 2019 బడ్జెట్​ ఒక మార్గమని ప్రధాని మోదీ ప్రశంసించారు. రైతులు, మధ్యతరగతి వారు, యువత ఈ బడ్జెట్​తో ఎంతో లబ్ధిపొందుతారన్నారు.

By

Published : Jul 5, 2019, 3:07 PM IST

'నవభారత్​ నిర్మాణానికి మార్గం ఈ బడ్జెట్​'

2019 బడ్జెట్​పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. దేశ ప్రగతికి ఈ బడ్జెట్​ ఒక మార్గమని కొనియాడారు. అభివృద్ధి, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా బడ్జెట్​ను రూపొందించారని కొనియాడారు. ఈ పద్దుతో పేదలకు మంచి జీవితం, యువతకు మంచి భవిష్యత్తు లభిస్తుందన్నారు మోదీ.

'నవభారత్​ నిర్మాణానికి మార్గం ఈ బడ్జెట్​'

"ప్రజల ఆశలు, అవసరాలు పూర్తవుతాయని ఈ బడ్జెట్ విశ్వాసం కల్పించింది. దిశ సరిగా ఉందని నిరూపించింది. అందుకే కచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం. ఈ బడ్జెట్​ ఆశ, ఆకాంక్షల బడ్జెట్​. ఇది భారతీయుల ఆశలు నెరవేర్చడం సహా నవ భారత నిర్మాణంలో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంటుంది."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టి... అన్నదాత ఆదాయం రెట్టింపు చేయడానికి మార్గనిర్దేశకంగా బడ్జెట్​ ఉందన్నారు ప్రధాని. మధ్య తరగతి ప్రజలు జీవనం మెరుగుపడుతుందని ధీమా వ్యక్తంచేశారు.

ఇదీ చూడండి:- సచిన్ రికార్డు చెరిపేసిన అఫ్గాన్​ ఆటగాడు

ABOUT THE AUTHOR

...view details