దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా... ప్రభుత్వ అనుకూల పవనాలు కనిపిస్తున్నాయని అన్నారు ప్రధాని నరేంద్రమోదీ. సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించి, మరోమారు అధికారం చేపట్టడం ఖాయమని విశ్వాసం వ్యక్తంచేశారు.
'ప్రజాస్వామ్యం గెలవాలి- రికార్డులు బద్దలవ్వాలి'
వారణాసిలో నామినేషన్ దాఖలు చేయడానికి ముందు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాని నరేంద్రమోదీ. మెజారిటీలో ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బద్దలయ్యేలా చూడాలని పిలుపునిచ్చారు.
'ప్రజాస్వామ్యం గెలవాలి- రికార్డులు బద్దలవ్వాలి'
వారణాసి లోక్సభ నియోజకవర్గానికి భాజపా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి ముందు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు మోదీ. ఎన్నికల్లో ప్రజాస్వామ్యమే గెలవాలని... మెజారిటీలో ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బద్దలయ్యేలా చూడాలని భాజపా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
Last Updated : Apr 26, 2019, 11:44 AM IST