ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం కోసం న్యూయార్క్ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. పలు దేశాధినేతలతో వరుస చర్చలు జరిపారు. జర్మనీ, ఇటలీ, ఖతార్, భూటాన్, నెదర్లాండ్స్, కొలంబియా, నైజీరియా, నమీబియా, మాల్దీవుల దేశాధినేతలతో మోదీ సమావేశమయ్యారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాల్లో పరస్పర సహకారంపై ప్రధాని ఫలవంతమైన చర్చలు జరిపారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ట్వీట్ చేశారు.
జర్మనీ, ఇటలీ దేశాధినేతలతో మోదీ స్నేహగీతం - italy
జర్మనీ, ఇటలీ, భూటాన్ సహా పలు దేశాధినేతలతో మోదీ వరుస ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా మోదీ ఫలవంతమైన చర్చలు జరిపారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ట్వీట్ చేశారు.
జర్మనీ, ఇటలీ దేశాధినేతలతో మోదీ స్నేహగీతం
యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రిట్టా ఫోర్‌తోనూ సమావేశమయ్యారు మోదీ. భారత్‌లో చిన్నారుల ఆరోగ్యం, పోషణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
Last Updated : Oct 1, 2019, 7:29 PM IST