తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దిల్లీ ఎన్నికల్లో భాజపా ప్రధాన ప్రచారకర్తగా మోదీ' - union minister javdekar

దిల్లీ శాసనసభ ఎన్నికల నగార మోగిన నేపథ్యంలో ప్రధాన పార్టీలు వ్యూహరచనలు చేస్తున్నాయి. భాజపా ప్రధాన ప్రచారకర్తగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవహరించనున్నట్లు స్పష్టం చేశారు కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్​. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల బరిలో నిలవటమే పార్టీ వ్యూహమని వెల్లడించారు.

PM Modi as campaigner for Delhi elections
దిల్లీ ఎన్నికల భాజపా ప్రచారకర్తగా ప్రధాని మోదీ

By

Published : Jan 9, 2020, 11:18 PM IST

దిల్లీ శాసనసభ ఎన్నికల్లో భాజపా తరఫున ప్రధాన ప్రచారకర్తగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవహరిస్తారని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 8న పోలింగ్ జరగబోతున్న నేపథ్యంలో.. భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ నెలకొంది. అయితే.. సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా ఎన్నికలకు వెళ్ళిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయని జావడేకర్​ చెప్పారు.

దిల్లీ శాసనసభ ఎన్నికలకు సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడమే తమ పార్టీ వ్యూహమన్నారు కేంద్ర మంత్రి. దిల్లీ ఎన్నికల్లో భాజపాకు ప్రధాని మోదీ నేతృత్వం వహిస్తారని తెలిపారు. కేజ్రీవాల్ 2015లో గెలవడానికి కారణం అన్నా హజారే నేతృత్వంలోని అవినీతి వ్యతిరేక ఉద్యమమేనన్నారు. ఆ ఉద్యమానికి లభించిన ప్రజాదరణ కేజ్రీవాల్‌కు ఉపయోగపడిందని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:బంగాల్​: సీఐడీ వాహనాలను పేల్చేసిన దుండగులు

ABOUT THE AUTHOR

...view details