తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సైకిల్​పై వచ్చిన వీరాభిమానితో మోదీ భేటీ - దిల్లీ

తన వీరాభిమాని ఖీమ్​చంద్ ​భాయ్​ను ప్రధాని నరేంద్రమోదీ కలుసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాజపా అఖండ విజయానికి గుర్తుగా గుజరాత్​ అమ్రేలీ నుంచి దిల్లీ వరకు సైకిల్​ యాత్ర చేశారు భాయ్​.

వీరాభిమానితో మోదీ భేటీ

By

Published : Jul 3, 2019, 10:09 PM IST

Updated : Jul 3, 2019, 10:21 PM IST

వీరాభిమానితో మోదీ భేటీ

భాజపాపై వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న ఖీమ్​చంద్​ భాయ్​ను ప్రధాని నరేంద్రమోదీ దిల్లీలో కలుసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయానికి గుర్తుగా గుజరాత్​ అమ్రేలీ జిల్లా నుంచి దిల్లీ వరకు సైకిల్​ యాత్ర చేశారు భాయ్​.

ఎన్నికల్లో 300పైగా స్థానాల్లో భాజపా విజయ కేతనం ఎగురవేసింది. ఈ చారిత్రక విజయానికి గుర్తుగా 1000 కిలోమీటర్లు సైకిల్​ యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు భాయ్​. అనుకున్నదే తడవుగా యాత్రను మొదలుపెట్టారు.

యాత్ర పూర్తయిన విషయం తెలుసుకుని భాయ్​ను తన కార్యాలయానికి పిలుపించుకున్నారు మోదీ.

వీరాభిమానితో మోదీ భేటీ

"ఖీమ్​ చంద్​భాయ్​ని కలిశాను. భాజపా 300 సీట్లు గెలిచిందన్న ఆనందంలో అమ్రేలీ నుంచి దిల్లీ వరకు సైకిల్​పై వచ్చారు. ఆయన మాటను నిలబెట్టుకున్నారు. ఈ యాత్రతో ఆయనకు అభిమానులు పెరిగారు. భాయ్​ వినమ్రత, ఉత్సాహం నన్ను కట్టిపడేశాయి. "

-ప్రధాని నరేంద్రమోదీ

ఇదీ చూడండి: భాజపా ఎంపీలను మందలించిన మోదీ

Last Updated : Jul 3, 2019, 10:21 PM IST

ABOUT THE AUTHOR

...view details