తెలంగాణ

telangana

By

Published : Jun 14, 2019, 5:17 AM IST

Updated : Jun 14, 2019, 5:38 AM IST

ETV Bharat / bharat

'పీఎం-కిసాన్​ పింఛన్'​ పథకం ప్రవేశపెట్టిన కేంద్రం

మోదీ 2.0 ప్రభుత్వం జరిపిన తొలి కేబినెట్​ సమావేశంలోనే ప్రధానమంత్రి కిసాన్​ పెన్షన్​ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఫలితంగా ఈ పథకంలో చేరిన రైతులకు 60 ఏళ్లు నిండిన తరువాత నెలకు రూ.3 వేలు చొప్పున పింఛన్​ లభించనుంది.

'పీఎం-కిసాన్​ పింఛన్'​ పథకం ప్రవేశపెట్టిన కేంద్రం

'పీఎం-కిసాన్​ పింఛన్'​ పథకం ప్రవేశపెట్టిన కేంద్రం

ప్రధానమంత్రి రైతు పింఛన్​ పథకం విధివిధానాలను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకంలో చేరే రైతులు నెలకు రూ.100 పింఛనుగా చెల్లించాలని సూచించింది. పింఛన్​ నిధికి అంతే మొత్తం కేంద్రం చెల్లిస్తుందని వెల్లడించింది. ఈ పథకం ద్వారా 60 ఏళ్ల వయస్సు నిండిన రైతులకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున పింఛన్​ లభించనుంది.

మోదీ 2.0 ప్రభుత్వ తొలి కేబినెట్ సమావేశంలోనే రైతుల ప్రత్యేక పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం వల్ల ఈ మూడు సంవత్సరాల్లో ఐదు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం ద్వారా కేంద్ర ఖజానాపై ఏడాదికి రూ.10,775 కోట్ల భారం పడనుంది. పీఎం కిసాన్​ పింఛన్​ నిధి నిర్వహణ, పింఛన్​ చెల్లింపు బాధ్యతలను ఎల్​ఐసీ చూసుకుంటుంది.

పీఎం కిసాన్ ఫించన్​ విధివిధానాలపై కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. రాష్ట్రాల వ్యవసాయమంత్రులతో వీడియో సమావేశం నిర్వహించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ పథకాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని కోరారు. పథకంపై రైతులకు అవగాహన కల్పించి, 18 నుంచి 40 ఏళ్లలోపు వారిని ఈ పథకంలో చేర్పించాలని తోమర్​ ఆయా రాష్ట్రాలకు సూచించారు.

ఈ పథకం ప్రీమియం వయసులవారీగా మారనుంది. పీఎం కిసాన్​ సమ్మాన్​ పథకం ద్వారా అందే సొమ్ము నుంచి రైతులు నేరుగా పింఛను వాటా చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. పారదర్శకత కోసం ఆన్​లైన్ వివాద పరిష్కార వ్యవస్థను ఏర్పాటుచేస్తామని చెప్పారు.

ఇదీ చూడండి: 'దొంగ' తెలివి: సీసీటీవీ వైర్లు కత్తిరించి ఏటీఎం చోరీ

Last Updated : Jun 14, 2019, 5:38 AM IST

ABOUT THE AUTHOR

...view details