ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లో 'ఆరోగ్య వన్' అనే ఔషధ మొక్కలు, మూలుకల వనాన్ని శుక్రవారం ప్రారంభించారు. గుజరాత్ పర్యటలనో భాగంగా.. ఐక్యతా విగ్రహానికి సమీపంలోని కేవడియా గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ వనాన్ని మోదీ సందర్శించారు.
17 ఏకరాల విస్తీర్ణంలో ఉన్న ఆరోగ్య వన్లో.. మానవాళి ఆరోగ్యానికి అవసరమైన ఔషధ మొక్కలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ వనంలో ఎంపిక చేసిన 380 జాతుల మొక్కలను పెంచినట్లు చెప్పారు. మొక్కల ప్రత్యేకత, ఔషధ గుణాలను తెలుసుకునేందుకు వీలుగా వాటికి సంబంధించిన వివరాలను బోర్డులపై రాసి సందర్శకులకు అందుబాటులో ఉంచినట్లు వివరించారు.