దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అసాధారణమైన నిర్ణయాలు తీసుకుందని ప్రధాని మోదీ వెల్లడించారు. సంక్లిష్ట కాలంలో అసాధారణమైన పరిష్కారాలు అవసరమని ఆయన సూచించారు. విదేశాల్లో ఉన్న 130 భారత రాయబార కార్యాలయ అధికారులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అనివార్యం
కరోనా సంక్షోభ సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు రాయబారులు చేసిన కృషిని మోదీ అభినందించారు. మహమ్మారిపై పోరాడేందుకు లాక్‌డౌన్ అనివార్య చర్య అని పేర్కొన్న ఆయన.. అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు అండగా నిలవాలని రాయబారులను కోరారు.