తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆర్​బీఐ నుంచి సర్కారు డబ్బు దొంగతనం' - ఆర్థిక విపత్తు

ఆర్​బీఐ కేంద్ర ప్రభుత్వానికి 1.76 లక్షల కోట్ల ఆర్థికసాయం అందించటంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. 'స్వయంగా సృష్టించిన ఆర్థిక విపత్తును' పరిష్కరించడంలో ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ విఫలమయ్యారని విమర్శించారు. ఆర్బీఐ నుంచి సొమ్ము దొంగిలించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

'ఆర్​బీఐ నుంచి సర్కారు డబ్బు దొంగతనం'

By

Published : Aug 27, 2019, 12:32 PM IST

Updated : Sep 28, 2019, 11:00 AM IST

కేంద్ర ప్రభుత్వానికి సాయంగా ఆర్​బీఐ రికార్డు స్థాయిలో నగదు బదిలీ చేయడాన్ని.. కాంగ్రెస్ నేత రాహుల్​గాంధీ తప్పుపట్టారు. ఆర్థిక మందగమనాన్ని పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

'స్వయంగా సృష్టించిన ఆర్థిక విపత్తు'ను పరిష్కరించడంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిగా విఫలమయ్యారు. ఏం చేయాలో పాలుపోక వీరిరువురూ... కేంద్ర బ్యాంకు నుంచి డబ్బులు దొంగిలించారు."- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్ నేత ట్వీట్​

కేంద్ర ప్రభుత్వ చర్యలు.. డిస్పెన్సరీ నుంచి బ్యాండేజీ దొంగలించి... తుపాకి కాల్పుల్లో ఏర్పడిన గాయానికి వేసినట్లు ఉందని రాహుల్​గాంధీ ఎద్దేవా చేశారు.

భారీ బొనాంజా

రిజర్వ్​ బ్యాంకు ఆఫ్​ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో... రూ.1,76,051 కోట్ల ఆర్థికసాయం అందించాలని నిర్ణయించింది. ద్రవ్యలోటు పెరగకుండా, ఆర్థిక మందగమనాన్ని నిరోధించేలా కేంద్రం చర్యలు తీసుకోవడానికి ఇది దోహదం చేస్తుంది.

ఇదీ చూడండి: కేంద్రానికి ఆర్​బీఐ రూ.1.76 లక్షల కోట్ల సాయం

Last Updated : Sep 28, 2019, 11:00 AM IST

ABOUT THE AUTHOR

...view details