తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమెరికా నుంచి ప్రధాని మోదీ తిరుగు ప్రయాణం - pm departure

అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ప్రధాని నరేంద్రమోదీ భారత్​కు తిరుగు ప్రయాణమయ్యారు. అమెరికాలో ఆయనకు లభించిన ఘన స్వాగతానికి ఆ దేశ ప్రజలకు, అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​నకు కృతజ్ఞతలు తెలిపారు.

మోదీ

By

Published : Sep 28, 2019, 8:19 AM IST

Updated : Oct 2, 2019, 7:35 AM IST

ప్రధాని మోదీ తిరుగు ప్రయాణం

అమెరికా పర్యటనను ముగించుకున్న ప్రధాని మోదీ స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. తనకు లభించిన స్వాగతానికి, ఆతిథ్యానికి అమెరికన్‌ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పర్యటనలో పాల్గొన్న వివిధ కార్యక్రమాలు భారత్‌కు ఎంతో మేలు చేస్తాయని ప్రధాని పేర్కొన్నారు.

ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణవుతున్న ప్రధాని చిత్రాలను ట్విట్టర్‌లో పోస్టు చేశారు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్‌. తిరుగు ప్రయాణమయ్యే ముందు తన పర్యటన వివరాలను ట్విట్టర్‌లో మోదీ వెల్లడించారు.

ఈ పర్యటనలో ఐరాస సర్వ ప్రతినిధుల సభ, హౌడీ మోదీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. హౌడీ మోదీ కార్యక్రమానికి హాజరైనందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక సంబంధాలపై అద్భుతంగా చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఐరాస: శాంతి, సామరస్య సందేశం.. మోదీ ప్రసంగం

Last Updated : Oct 2, 2019, 7:35 AM IST

ABOUT THE AUTHOR

...view details