తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"చౌకీదార్ అప్రమత్తమే" - ఆరోపణలు

పట్నాలో ఎన్డీఏ సంకల్ప ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి నితీశ్​​ను అభినందించారు. చౌకీదార్​ను దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని... కానీ తాను ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటానని మోదీ స్పష్టం చేశారు.

"చౌకీదార్ అప్రమత్తమే"

By

Published : Mar 3, 2019, 3:09 PM IST

నాలుగేళ్లలో పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఎన్​డీఏ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. బిహార్​ రాజధాని పట్నాలో ఎన్డీఏ సంకల్ప ర్యాలీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​తో కలిసి పాల్గొన్నారు మోదీ. పేదల రక్షణకు, దేశ రక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

బిహార్​లో జరుగుతున్న అభివృద్ధిపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సౌభాగ్య పథకంతో ప్రతి ఇంటికి విద్యుత్​ అందిస్తున్నారని ముఖ్యమంత్రి నితీశ్​​ను మోదీ అభినందించారు. నితీశ్​​-సుశీల్​ మోదీ కలిసి రాష్ట్రాభివృద్ధిలో పురోగతి సాధించారని కొనియాడారు.

చౌకీదార్​ ధైర్యాన్ని కొందరు సహించలేకే దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని మోదీ ఆరోపించారు.

"చౌకీదార్ అప్రమత్తమే"

"చౌకీదార్​ను దెబ్బతీసేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు నిశ్చింతగా ఉండండి. మీ చౌకీదార్​ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్నాడు. పేదల రక్షణలోనైనా, దేశ రక్షణలోనైనా.. దేశాన్ని దెబ్బతీసేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలను మీ చౌకీదార్​, ఎన్​డీఏ కూటమి గోడలా నిలబడి అడ్డుకుంటుంది."
---- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ABOUT THE AUTHOR

...view details