ఆదివారం ఇద్దరు పోలీసులు ఓ పెట్రోల్ పంప్ వద్ద యూనిఫామ్‌లోనే గొడవకు దిగారు. మాటలతో ప్రారంభమైన వీరి తగాదా అంతటితో ఆగలేదు. పోలీస్ వ్యాన్‌లో ఉన్న లాఠీలు తీసుకుని ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. వారితో ఉన్న మరో నలుగురు ఆపడానికి ప్రయత్నించారు. ఆపై ఓ పోలీస్ సహా ముగ్గురు వ్యాన్‌లో అక్కడి నుంచి వెళ్లిపోయారు. లంచం విషయంలో భేదాభిప్రాయాలే ఈ ఘర్షణకు దారితీసినట్లు సమాచారం.
పెట్రోల్ బంక్ వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో పోలీసుల వీరంగం రికార్డయింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. ఉన్నతాధికారులు ఇద్దరినీ సస్పెండ్ చేశారు. విచారణ కొనసాగుతోంది.