తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చారిత్రక అయోధ్య తీర్పుపై సుప్రీంలో రివ్యూ పిటిషన్​ - అయోధ్య సుప్రీం తీర్పు

అయోధ్య కేసు తీర్పుపై సమీక్ష కోరుతూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. జమైత్​ ఉలామా-ఈ-హింద్​ అధ్యక్షుడు మౌలానా సయ్యద్​ అస్సద్​ రషీదీ ఈ పిటిషన్​ వేశారు.

Plea seeking review of Ayodhya judgement filed in SC
చారిత్రక అయోధ్య తీర్పుపై సుప్రీంలో రివ్యూ పిటిషన్​

By

Published : Dec 2, 2019, 3:50 PM IST

చారిత్రక అయోధ్య తీర్పుపై సుప్రీంలో రివ్యూ పిటిషన్​

వివాదాస్పద అయోధ్య భూమిలో రామమందిరం నిర్మించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్​ దాఖలైంది. అయోధ్య కేసులో అసలు కక్షిదారుడి వారసుడు, జమైత్​ ఉలామా-ఈ-హింద్​ అధ్యక్షుడు మౌలానా సయ్యద్​ అస్సద్​ రషీదీ ఈ వ్యాజ్యం వేశారు.

రికార్డుల్లో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్​ 137 కింద తీర్పుపై రివ్యూ కావాలంటూ పిటిషన్​ దాఖలు చేశారు రషీదీ.

ఇదీ తీర్పు...

అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి సుప్రీం కోర్టు నవంబర్​ 9న ముగింపు పలికింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిలో రామ మందిర నిర్మాణం చేపట్టాలని స్పష్టంచేసింది. మసీదు నిర్మాణానికి.. 5 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్‌ బోర్డుకు అయోధ్యలోనే కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

ఇదీ చూడండి:- 'అయోధ్య'పై సుప్రీం చారిత్రక తీర్పు.. శ్రీరామ పట్టాభిషేకం

ABOUT THE AUTHOR

...view details