తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా బాధితుల కోసం 'ప్లాస్మా బ్యాంక్​': కేజ్రీవాల్

దేశంలోనే తొలిసారిగా కరోనా బాధితుల కోసం 'ప్లాస్మా బ్యాంక్' ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​. ఆరోగ్యం క్షీణించిన వారికి ప్లాస్మా థెరపి ద్వారా చికిత్స అందించనున్నట్లు స్పష్టం చేశారు. ఎల్​ఎన్​జేపీ ఆసుపత్రి సీనియర్​ డాక్టర్​ అసీమ్​ గుప్తా కరోనాతో మృతి చెందటం పట్ల విచారం వ్యక్తం చేశారు.

Plasma bank to be set up in Delhi for treatment of COVID-19 patients
కరోనా బాధితుల కోసం 'ప్లాస్మా బ్యాంక్​'

By

Published : Jun 29, 2020, 2:18 PM IST

కరోనా రోగుల చికిత్స కోసం దేశంలోనే తొలిసారిగా 'ప్లాస్మా బ్యాంక్' ఏర్పాటు చేయనున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. రెండు రోజుల్లో ప్లాస్మా బ్యాంక్‌ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. కరోనాతో ఆరోగ్యం క్షీణించిన వారికి ప్లాస్మా థెరపితో చికిత్స అందించనున్నట్లు తెలిపారు.

కరోనా నుంచి కోలుకున్న రోగులు ప్లాస్మా దానం చేయాలని కోరారు కేజ్రీవాల్​. వైరస్​ బారిన పడుతున్న వారికి సాయం చేయాలని సూచించారు.

డాక్టర్​ మృతి పట్ల విచారం..

కరోనాతో మరణించిన ఎల్ఎన్​జేపీ ఆసుపత్రి సీనియర్ డాక్టర్ అసీమ్ గుప్తా మృతికి సంతాపం తెలిపారు కేజ్రీవాల్​. వైద్యుడి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించారు.

ఇదీ చూడండి:నది ఒడ్డున ఇసుకలోనే ప్రసవ వేదన

ABOUT THE AUTHOR

...view details