దేశవ్యాప్తంగా లాక్డౌన్తో మందు దొరక్క ఇబ్బందులు పడ్డ మద్యం ప్రియులకు మరోమారు ఆ పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మద్యం, మత్తుపానీయాల వినియోగంపై నిషేధం విధించాలని.. సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
మద్యం నిషేధానికై భాజపా నేత, న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయవాది అశ్విని కుమార్ దూబే ద్వారా కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
"కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో మద్యం వినియోగం వల్ల.. తీవ్ర అనారోగ్యం సహా వైరస్ ముప్పు తెచ్చే ప్రవర్తన, మానసిక ఆరోగ్య సమస్యలు, హింసాత్మక ఘటనలు పెరుగుతాయి. మద్యం, మత్తు పానీయాలను తీసుకోవటం ద్వారా రోగనిరోధక శక్తి తగ్గిపోయి వైరస్ సోకే ప్రమాదం అధికమవుతుంది. వాటితో పాటు గృహ హింస, మహిళలపై దాడులు పెరుగుతాయి."