చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ... రెండో విడత మలబార్ నౌకా విన్యాసాలు శుక్రవారంతో ముగియనున్నాయి. చైనాకు వ్యతిరేకంగా ఇటీవల మలబార్ కూటమిలోకి ఆస్ట్రేలియా కూడా చేరడం వల్ల 'మలబార్–2020 విన్యాసాల'కు ప్రాధాన్యం సంతరించుకుంది. విన్యాసాలపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ... మహాసముద్రాలపై స్నేహబంధాన్ని బలపరుచుకోవడమే ఇతివృత్తంగా భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు మలబార్ కసరత్తులు చేస్తున్నాయి.
చైనా ఉలిక్కిపడేలా మలబార్ విన్యాసాలు
ఉత్తర అరేబియా సముద్రంలో జరుగుతున్న రెండో విడత మలబార్-2020 నావిక దళ విన్యాసాలు అదరగొడుతున్నాయి. భారత్‌తోపాటు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా నౌక దళాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి.
రెండోవిడత మలబార్ విన్యాసాలతో చైనా ఆందోళన!
దృఢమైన సైనిక సంబంధాలే లక్ష్యంగా ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తీర ప్రాంత భద్రతకు వాటిల్లుతున్న ముప్పును, ఉమ్మడి సవాళ్లను మరింత సమన్వయంతోను, సమర్థంగా ఎదుర్కోవడానికి ఈ విన్యాసాలు దోహదపడతాయని క్వాడ్ దేశాలు భావిస్తున్నాయి. తద్వారా సముద్ర మార్గాలపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న చైనాకు చెక్ పెట్టాలని మలబార్ దేశాలు యోచిస్తున్నాయి.
ఇదీ చూడండి:భారత అమ్ములపొదిలో 'పొసిడాన్ 8ఐ-పీ8ఐ'