తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బడ్జెట్ 2019: ఈ వస్తువులు మరింత ప్రియం - బంగారం

కేంద్ర వార్షిక బడ్జెట్​లో పలు వస్తువులపై దిగుమతి సుంకాలు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించారు. పెట్రోల్​, డీజిల్​, బంగారం, వెండి, సిగరెట్స్ వంటి వాటితో పాటు మరిన్ని వస్తువులు ప్రియం కానున్నాయి. కొన్నింటిపై పన్నులు తగ్గించారు.

బడ్జెట్ 19: ఈ వస్తువులు మరింత ప్రియం

By

Published : Jul 5, 2019, 3:55 PM IST

పెట్రోల్​, డీజిల్​, బంగారం, వెండి, సిగరెట్స్​, దిగుమతి చేసుకునే కార్లతో పాటు పలు వస్తువులు మరింత ప్రియం కానున్నాయి. మోదీ 2.0 ప్రభుత్వంలో తొలి వార్షిక బడ్జెట్​ ప్రవేశపెట్టిన సందర్భంగా భారీ సంఖ్యలో వస్తువులపై దిగుమతి సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. దేశీయ ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ధరలు పెరిగేవి..

  • పెట్రోల్​, డీజిల్​
  • సిగరెట్స్​, హుక్కా, పొగాకు ఉత్పత్తులు
  • బంగారం, వెండి
  • విదేశీ కార్లు
  • స్ల్పిట్​ ఎయిర్​ కండిషనర్లు
  • లౌడ్​ స్పీకర్లు
  • డిజిటల్​ వీడియో కెమెరా రికార్డర్లు
  • దిగుమతి చేసుకునే పుస్తకాలు
  • సీసీటీవీ కెమెరాలు
  • జీడిపప్పు
  • దిగుమతి చేసుకునే ప్లాస్టిక్ వస్తువులు
  • సబ్బుల తయారీ ముడి పదార్థాలు
  • వినైల్ ఫ్లోరింగ్, టైల్స్
  • ఆప్టికల్​ ఫైబర్​
  • సిరామిక్​ టైల్స్​, వాల్​ టైల్స్​
  • దిగుమతి చేసుకునే స్టెయిన్​ లెస్​ స్టీల్​ ఉత్పత్తులు
  • దిగుమతి చేసుకునే వాహనాల విడిభాగాలు
  • వార్తా పత్రికలు, మ్యాగజైన్​లకు వినియోగించే న్యూస్​ప్రింట్​, పేపర్​
  • మార్బుల్​ స్లాబ్స్​
  • ఖరీదైన గృహోపకరణాలు

ధరలు తగ్గేవి...

  • విద్యుత్​ వాహనాల పరికరాలు
  • కెమెరా పరికరాలు, మొబైల్​ ఫోన్ల ఛార్జర్లు
  • సెట్ టాప్​ బాక్స్​లు
  • భారత్​లో తయారు కాని, దిగుమతి చేసుకునే రక్షణ ఉత్పత్తులు

ABOUT THE AUTHOR

...view details