తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్​ ప్రధానిపై బిహార్​ న్యాయస్థానంలో ఫిర్యాదు

పాక్​ ప్రధానిపై బిహార్​ కోర్టులో ఫిర్యాదు నమోదైంది. ఐరాస ప్రసంగం ద్వారా భారత్​పై యుద్ధం ప్రకటించేందుకు ఇమ్రాన్​ ప్రయత్నించారని ఆరోపిస్తూ ముజఫర్​పుర్​ న్యాయస్థానంలో ఓ న్యాయవాది పిటిషన్​ వేశారు.

పాక్​ ప్రధాని పై భారత్​ లో కేసు నమోదు

By

Published : Sep 29, 2019, 1:18 PM IST

Updated : Oct 2, 2019, 10:57 AM IST

ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల్లో పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ చేసిన ప్రసంగాన్ని తప్పుబడుతూ బిహార్​లోని ముజఫర్​పుర్​ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. తన ప్రసంగం ద్వారా భారత్​పై యుద్ధం ప్రకటించేందుకు ఇమ్రాన్​ ప్రయత్నించారని ఆరోపించారు న్యాయవాది సుధీర్​ కుమార్​ ఓజా.

దేశద్రోహం(ఐపీసీ సెక్షన్​ 124(ఎ)), భారత్​పై యుద్ధం ప్రకటించడం(సెక్షన్​ 125), హింసకు పాల్పడేలా ఓ వర్గాన్ని రెచ్చగొట్టడం(సెక్షన్​ 505) వంటి అభియోగాలపై కేసు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు సుధీర్​. ఈ వ్యాజ్యంపై అక్టోబరు 24న విచారణ జరిగే అవకాశముంది.

గతంలో వేర్వేరు సందర్భాల్లో బాలీవుడ్​ తారలు, రాజకీయ నేతలపై న్యాయస్థానంలో ఇలానే ఫిర్యాదు చేశారు సుధీర్.

ఇదీ చూడండి : 'భారత్​ను అస్థిర పరిచేందుకు పాక్​ కుట్రలు'

Last Updated : Oct 2, 2019, 10:57 AM IST

ABOUT THE AUTHOR

...view details