కర్ణాటకలోని మంగళూరులో బురద నీటిలో నిర్వహించే 'కేసార్డ్ ఓంజీ దినం' సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు స్థానికులు. వేడుకల్లో భాగంగా స్థానిక సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నిర్వహించిన పలు క్రీడల్లో ఉల్లాసంగా పాల్గొన్నారు. ఏటా వర్షాలు సమృద్ధిగా పడే మాసంలో బురద మడుగులో పురాతన క్రీడలు ఆడుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, పరుగు పందెం లాంటి ఆటల పోటీలు నిర్వహించారు. మధ్యాహ్న భోజనంలో ప్రాంతీయ వంటకాలు మెనులో చేర్చి విందు ఆరగించారు.
బురద మడుగులో 'కేసార్డ్ ఓంజీ' ఉత్సవాలు - కర్ణాటక
మంగళూరులో 'కేసార్డ్ ఓంజీ దినాన్ని' స్థానికులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు క్రీడల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. బురద మడుగులో యువతీ-యువకులు చేసిన జానపద నృత్యాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏటా వర్షాలు సమృద్ధిగా పడే మాసంలో ఈ పురాతన క్రీడలను నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
బురద మడుగులో 'కేసార్డ్ ఓంజీ' ఉత్సవాలు
ఆలయ ప్రాంగణంలోని బురద మడుగులో యువతీ-యువకులు చేసిన జానపద నృత్యాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉడిపి జిల్లా పంచాయత్, లయన్స్ క్లబ్తో పాటు అలీవర్ సార్వజనిక గణేష్ ఉత్సవ సమితి సంయుక్తంగా ఈ వార్షిక ఉత్సవాలను నిర్వహించాయి.
ఇదీ చూడండి : చెరుకుగెడల కోసం రహదారి దిగ్బంధించిన గజరాజు