తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పద్మ భూషణ్​ వెనక్కి ఇచ్చేస్తా: హజారే - అన్నా హజారే

దేశంలోని మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్​ను వదులుకునేందుకు సిద్ధపడ్డారు అన్నా హజారే.

అన్న హజారే

By

Published : Feb 4, 2019, 11:46 PM IST

అన్న హజారే
ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే తనకు ఇచ్చిన దేశ మూడో అత్యున్నత పౌరపురస్కారం పద్మ భూషణ్​ను వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటించారు. హజారే అవార్డు కోసం పని చేయలేదని తెలిపారు. తాను చేసిన సామాజిక సేవకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారన్నారు. ప్రస్తుతం దేశమున్న పరిస్థితుల్లో పద్మభూషణ్​ను తనవద్దే పెట్టుకోవటం సరైనది కాదన్నారు.

" నా పద్మ భూషణ్​ పురస్కారాన్ని రాష్ట్రపతికి తిరిగి ఇచ్చేస్తాను. నేను పురస్కారం కోసం పని చేయలేదు. సమాజం, దేశం కోసం సేవ చేస్తూ ఉంటే మీరే ఇచ్చారు. ప్రస్తుతం సమాజం, దేశం ఇబ్బందుల్లో ఉంటే ఈ పురస్కారం ఎందుకు..?"
- అన్నా హజారే, సామాజిక ఉద్యమకారుడు

లోకాయుక్త, లోక్‌పాల్‌ నియామకంలో కేంద్ర ప్రభుత్వ జాప్యంపై నిరసనగా అన్నాహజారే ‘'జన్‌ ఆందోళన్‌ సత్యాగ్రహ'’ పేరిట గత నెల 30 నుంచి స్వగ్రామం రాలేగావ్‌ సిద్ధిలో దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details