తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మళ్లీ అధికారంలోకి వస్తే రూ. 5లక్షల జీవనభృతి' - ఛామ్లింగ్

సిక్కిం ముఖ్యమంత్రి పవన్​ కుమార్​ ఛామ్లింగ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. యువతను ఆకర్షించేలా అనేక తాయిలాలు ప్రకటించారు. యువత జీవితంలో స్థిరపడేలా రూ. 5 లక్షల ఆర్థిక చేయూత అందిస్తామని హామీ ఇచ్చారు.

'మళ్లీ అధికారం అందిస్తే రూ. 5లక్షల జీవనభృతి'

By

Published : Mar 29, 2019, 11:35 PM IST

లోక్​సభ ఎన్నికలతో పాటు సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, సిక్కిం డెమోక్రటిక్ పార్టీ అధినేత పవన్​ కుమార్ ఛామ్లింగ్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. తమ పార్టీకి మరోసారి అధికారం అందిస్తే యువతకు చేసే కార్యక్రమాలను వెల్లడించారు. యువత స్థిరపడేందుకు రూ. 5 లక్షల జీవనభృతిని అందిస్తామని ప్రకటించారు.

"యువతకే ప్రాధాన్యం" ఇదే మా విధానం. యువత ఎల్లప్పుడూ మాకు ప్రధానాంశమే"- పవన్ కుమార్ ఛామ్లింగ్, సిక్కిం ముఖ్యమంత్రి
సిక్కిం ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే అంకుర పథకాల్లో చేరాలనుకునే యువతకు ఒకేసారి రూ. 5 లక్షలను వారి ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు.

ఛామ్లింగ్ హామీలు...

⦁ అంకుర సంస్థలకు రూ.20 నుంచి రూ.30 లక్షల వరకు రుణం

⦁ ఒక వ్యక్తికి ఒకే వృత్తి

⦁ వ్యవసాయ రుణాల మాఫీ

⦁ ఆర్థిక భద్రత పేరుతో రైతులకు రూ. 40 వేలు ఆర్థికసాయం

⦁ సేంద్రియ వ్యవసాయదారులకు రూ. 60 వేల ఆర్థికసాయం

గెలిస్తే ఆరోసారి..

పవన్​కుమార్ ఛామ్లింగ్ 25 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయిదుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్న రికార్డు పవన్​కుమార్ ఛామ్లింగ్ పేరిటే ఉంది. ఈ ఎన్నికల్లో గెలిస్తే ముఖ్యమంత్రిగాఆరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారు ఛామ్లింగ్​.

ABOUT THE AUTHOR

...view details