తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిట్​ఫండ్ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్​ ఆమోదం - పార్లమెంట్

చిట్​ఫండ్​ ద్రవ్య పరిమితి సహా నిర్వాహకుడి కమీషన్​ పెంచే ఉద్దేశంతో తీసుకొచ్చిన చిట్​ఫండ్​ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్​ ఆమోదం తెలిపింది. నవంబర్​ 20న లోక్​సభ ఆమోదం పొందిన సవరణ బిల్లుకు నేడు రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది.

Parliament passes chit funds bill
చిట్​ఫండ్ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్​ ఆమోదం

By

Published : Nov 28, 2019, 6:37 PM IST

చిట్​ఫండ్​ సంస్థలకు ద్రవ్య పరిమితులు పెంచడం సహా నిర్వాహకులకు కమీషన్లు పెంచుతూ ప్రవేశపెట్టిన చిట్​ఫండ్ చట్ట​ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు నవంబర్​ 20న లోక్​సభ గడప దాటగా... నేడు రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది.

ఈ బిల్లు ద్వారా ఒక వ్యక్తి లేదా నలుగురు భాగస్వాములతో కూడిన సంస్థల జమ చేసే నగదు​ గరిష్ఠ మొత్తం రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షలకు పెరగనుంది. నలుగురి కంటే ఎక్కువ సభ్యులతో కూడిన భాగస్వామ్య సంస్థల మొత్తాన్ని రూ.6 లక్షల నుంచి రూ.18 లక్షలకు పెరిగే విధంగా చట్టాన్ని సవరించారు.

నిర్వాహకుడి కమీషన్​ పెంపు

చిట్​ఫండ్​ నిర్వహణ బాధ్యతను చూసే వ్యక్తికి ఇచ్చే కమీషన్​ను సైతం పెంచుతూ చట్టంలో సవరణలు చేశారు. ఈ బిల్లుతో ప్రస్తుతం ఫోర్​మన్​ పొందే కమీషన్​ 5 శాతం నుంచి 7 శాతానికి పెరగనుంది. చిట్​ఫండ్స్​ను మరింత గౌరవనీయంగా మార్చేందుకు 'ఫ్రాటెర్నిటీ ఫండ్'​, 'రొటేటింగ్​ సేవింగ్స్'​, 'క్రెడిట్​ ఇన్​​స్టిట్యూషన్'​ వంటి కీలక పదాలను చేర్చారు.

ABOUT THE AUTHOR

...view details