బ్యాంకు ఖాతా, మొబైల్ నంబర్ పొందేందుకు ఆధార్ సంఖ్యను స్వచ్ఛందంగా వినియోగించుకునే వీలు కల్పించే ఆధార్, ఇతర చట్టాల సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. రాజ్యసభలో మూజవాణి ఓటుతో బిల్లుకు నేడు ఆమోదం లభించింది.
ఆధార్ చట్టం 2016, మనీ లాండరింగ్ చట్టం 2005, భారతీయ టెలిగ్రాఫ్ చట్టం 1885లలో సవరణలు చేయడానికి వీలుగా ఈ బిల్లును రూపొందించారు. దీని ద్వారా ఆధార్ కలిగి ఉన్న వ్యక్తి అనుమతితో ఆధార్ సంఖ్యను భౌతికంగా, ఎలక్ట్రానిక్ రూపంలో ధ్రువీకరణకు ఉపయోగించుకోవచ్చు.