తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆంధ్రప్రదేశ్​ ఎన్​ఐడీకి జాతీయ ప్రాధాన్య హోదా - ట్రాన్స్​జెండర్ బిల్లు ఆమోదం

జాతీయ రూపకల్పన సంస్థ (ఎన్​ఐడీ) చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్​ సహా 4 రాష్ట్రాల్లోని ఎన్​ఐడీలకు జాతీయ ప్రాధాన్య హోదా కల్పించే ఈ బిల్లు మూజువాణి ఓటుతో లోక్​సభలో నెగ్గింది. ఇంతకుముందే ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది. ట్రాన్స్​జెండర్​ బిల్లుకూ పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది.

National Institute of Design
National Institute of Design

By

Published : Nov 26, 2019, 6:32 PM IST

జాతీయ రూపకల్పన సంస్థల చట్టం సవరణ బిల్లు-2019కు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఇప్పటికే రాజ్యసభలో నెగ్గిన ఈ బిల్లు నేడు లోక్​సభలో మూజువాణి ఓటుతో పాసయింది.

ఈ బిల్లు ద్వారా ఆంధ్రప్రదేశ్​తో పాటు మధ్యప్రదేశ్​, అసోం, హరియాణాలోని ఎన్​ఐడీలకు జాతీయ ప్రాధాన్యం దక్కనుంది.

వీగిన సవరణలు..

ఎన్​ఐడీ బిల్లుకు చాలామంది విపక్ష సభ్యులు సవరణలు ప్రతిపాదించారు. తమ తమ రాష్ట్రాల్లో ఎన్​ఐడీలకు జాతీయ ప్రాధాన్యం కల్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్​కు కేటాయించిన ఎన్​ఐడీని తెలంగాణకు తరలించాలని తెరాస ఎంపీ బీబీ పాటిల్​ ప్రతిపాదించారు. అయితే ఈ సవరణలన్నీ వీగిపోయాయి.

ట్రాన్స్​జెండర్ల బిల్లుకూ..

ట్రాన్స్​జెండర్ల హక్కుల రక్షణ బిల్లు-2019కు పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. ఈ ఏడాది ఆగస్టు 5న లోక్​సభ ఆమోదించిన ఈ బిల్లు.. నేడు రాజ్యసభలో నెగ్గింది.

ట్రాన్స్​జెండర్లకు సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన సాధికారత కల్పించే లక్ష్యంతో ఈ బిల్లును రూపొందించింది కేంద్రం.

ఇదీ చూడండి: ట్రాన్స్‌జెండర్ల హక్కుల బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details