పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ సమయానికి ఎనిమిది రోజుల ముందే ముగియనున్నట్లు తెలుస్తోంది. కరోనా భయాల మధ్య ఉభయ సభల సమావేశాలను బుధవారం నిరవధిక వాయిదా వేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
బుధవారం ఐదు బిల్లులపై చర్చ అనంతరం రాజ్యసభ వాయిదా పడనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన లోక్సభ.. సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. శూన్య గంటతో పాటు పలు అంశాలపై చర్చించిన తర్వాత లోక్సభనూ నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.
ఎంపీలకు కరోనా..