పార్లమెంట్ ప్రాంగణంలో సరికొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తమ లంచ్ బాక్స్‌లను, ఇతర పాత్రలను కడగరాదని లోక్‌సభ సచివాలయం స్పష్టంచేసింది. ఈ మేరకు ఓ సర్కులర్ జారీ చేసింది.
"పార్లమెంట్ భవన సముదాయంలో.. పాత్రలను, లంచ్ బాక్స్‌లను కడుగుతున్నందున డ్రైనేజీకి ఆటంకం ఎదురవుతోంది. ఇది పారిశుద్ధ్య సమస్యలను తెచ్చిపెడుతోంది. దుర్గంధం వ్యాపిస్తోంది. దయచేసి వాష్‌రూమ్‌లలో ఎవరూ పాత్రలు కడగవద్దు. పరిశుభ్రతను పాటించడంలో అందరూ సహకరించండి."
-- లోక్‌సభ సచివాలయం