భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు దేవాలయం లాంటి పార్లమెంటు భవనం స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో కొత్త వెలుగులతో భాసిల్లుతోంది. ఈ మేరకు నూతనంగా ఏర్పాటుచేసిన అత్యాధునిక విద్యుత్ దీపాల వ్యవస్థను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు.
విద్యుత్ కాంతుల్లో సరికొత్తగా పార్లమెంట్ - lightining
దేశ రాజధాని దిల్లీ.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా పార్లమెంట్ భవనం విద్యుత్ కాంతులతో కొత్త అందాలను సంతరించుకుని విరాజిల్లుతోంది.
ధగధగ విద్యుత్ కాంతులతో పార్లమెంట్ భవనం
పార్లమెంటు భవనానికి ఉన్న 144 స్తంభాలకు మొత్తం 875 ఎల్ఈడీ విద్యుత్తు దీపాలను అమర్చామని, ఇవి ప్రతి కొన్ని సెకన్లకు విభిన్న కాంతులను వెదజల్లుతాయని లోక్సభ సచివాలయం పేర్కొంది. ఈ దీపాలు సాధారణ దీపాలతో పోల్చితే ఐదో వంతు విద్యుత్తుతో పనిచేస్తాయని వివరించింది. సౌత్, నార్త్ బ్లాక్లు, రెసినా హిల్స్లలో కూడా ఇలాంటి వ్యవస్థలు ఏర్పాటు చేశారు.
Last Updated : Sep 26, 2019, 10:47 PM IST