తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పార్టీ లోక్​సభ సభ్యులకు భాజపా విప్​ జారీ - లోక్​సభ సమావేశాలు

Rajyasabha
రాజ్యసభ సమావేశాలు

By

Published : Feb 9, 2021, 10:00 AM IST

Updated : Feb 9, 2021, 9:19 PM IST

21:18 February 09

భాజపా విప్​ జారీ..

  • పార్టీ లోక్‌సభ సభ్యులకు 3 లైన్ విప్ జారీ చేసిన భాజపా
  • ముఖ్య శాసన వ్యవహారాల దృష్ట్యా బుధవారం రోజు తప్పక సభకు రావాలని విప్ జారీ

18:05 February 09

అధిర్​ ఆరోపణ- షా వివరణ

ఠాగూర్​ కుర్చీపై పార్లమెంటులో రగడ!

బంగాల్​ పర్యటన సందర్బంగా.. శాంతినికేతన్​లోని విశ్వకవి రవీంద్రనాథ్​ ఠాగూర్​ కుర్చీలో కేంద్ర మంత్రి అమిత్​ షా కూర్చున్నారని లోక్​సభలో ఆరోపించారు కాంగ్రెస్​ ఎంపీ అధిర్​ రంజన్​ చౌధరి. బదులిచ్చిన షా.. తాను ఠాగూర్​ కుర్చీలో కూర్చోలేదని స్పష్టం చేశారు. పర్యటకులకు కేటాయించిన విండో సీట్​లో కూర్చున్నానని వివరణ ఇచ్చారు.

అధిర్​కు కౌంటర్​గా.. మాజీ ప్రధాని జవహర్​లాల్ నెహ్రూ​నే ఆ కుర్చీలో కూర్చున్నారని సాక్ష్యాలున్నాయని తెలిపారు. 

16:29 February 09

ఉత్తరాఖండ్​ ఘటనపై లోక్​సభలో షా ప్రకటన..

ఉత్తరాఖండ్​ జలవిలయం ఘటన గురించి లోక్​సభలో ప్రకటన చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని స్పష్టం చేశారు.

ఎన్​టీపీసీ ప్రాజెక్ట్​కు చెందిన 12 మంది, రిషిగంగ ప్రాజెక్ట్​కు సంబంధించి 15 మందిని ఘటనా సమయంలో రక్షించినట్లు తెలిపారు. ఎన్​టీపీసీ ప్రాజెక్ట్​ రెండో టన్నెల్​ వద్ద 25-35 మంది చిక్కుకున్నట్లు భావిస్తున్నామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

  • మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 4లక్షల చొప్పున ప్రకటించిందని తెలిపారు.
  • ఉత్తరాఖండ్‌ వరదలపై లోక్‌సభలో మాట్లాడిన అమిత్‌ షా
  • ఎన్‌టీపీసీ మొదటి సొరంగం నుంచి 12 మందిని రక్షించారు: అమిత్‌ షా
  • రిషిగంగ ప్రాజెక్టు వద్ద మరో 15 మందిని రక్షించారు: అమిత్‌ షా
  • ఎన్‌టీపీసీ రెండో సొరంగంలో 25-35 మంది చిక్కుకున్నారు: అమిత్ షా
  • బాధితులను రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు: అమిత్‌ షా
  • సహాయ చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌, సైనిక, నౌకాదళ సిబ్బంది: అమిత్‌ షా
  • సహాయ చర్యల్లో 450 మంది ఐటీబీపీ జవాన్లు: అమిత్ షా
  • 5 హెలికాప్టర్లతో సహాయ చర్యలు: హోంమంత్రి అమిత్‌ షా
  • సహాయ చర్యల పర్యవేక్షణకు కంట్రోల్‌ రూమ్‌: అమిత్‌ షా
  • ఎన్టీపీసీ సొరంగం వద్ద శిథిలాలు తొలగించారు: అమిత్‌ షా
  • వరదల వల్ల 13 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి: అమిత్‌ షా

14:54 February 09

సాగు చట్టాల రద్దు కోసం..

సాగు చట్టాల రద్దును కోరుతూ పంజాబ్​కు చెందిన కాంగ్రెస్​ ఎంపీలు లోక్​సభ ముందుకు ప్రైవేటు మెంబర్స్​ బిల్లును తీసుకొచ్చారు. 

13:15 February 09

విపత్తు మృతులకు రాజ్యసభ సభ్యుల సంతాపం

ఉత్తరాఖండ్​ జల ప్రళయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు రాజ్యసభ సభ్యులు. మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. 

అంతకు ముందు.. విపత్తుపై రాజ్యసభలో ప్రకటన చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. కేంద్ర, రాష్ట్రాలకు చెందిన సంస్థలు పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.  450 మంది ఐటీబీపీ జవాన్లు, ఎన్​డీఆర్​ఎఫ్​కు చెందిన 5 బృందాలు, ఆర్మీ నుంచి 8 టీంలు, ఒక నౌకాదళ బృందం, 5 ఐఏఎఫ్​ హెలికాప్టర్లు సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు తెలిపారు. సోమవారం సాయంత్రానికి 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. 

మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం అందనుందని వెల్లడించారు షా. 

12:59 February 09

హిందుస్థానీ ముస్లింగా గర్వపడుతున్నా : ఆజాద్​

"దేశ విభజన సమయంలో పాకిస్థాన్​కి వెళ్లని అదృష్టవంతులలో నేనూ ఒకడిని. పాకిస్థాన్​లో పరిస్థితుల గురించి చదివినప్పుడు.. నేను హిందుస్థానీ ముస్లిం అని గర్వపడతా."

                    - గులాం నబీ ఆజాద్​, రాజ్యసభలో ప్రతిపక్ష నేత

12:03 February 09

'మీ సేవలు అవసరం.. కాంగ్రెస్​ కాదంటే మేం తీసుకొస్తాం'

కాంగ్రెస్​ రాజ్యసభ ఎంపీ, ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ పదవీ విరమణ వీడ్కోలు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి, ఆర్పీఐ నేత రామ్​దాస్​ అతవాలే. 'మీరు పార్లమెంట్​కు తిరిగి రావాలి. ఒకవేళ కాంగ్రెస్​ మిమ్మల్ని తిరిగి తీసుకురాకపోతే.. తీసుకొచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. పార్లమెంట్​కు మీరు అవసరం.' అని పేర్కొన్నారు.

11:08 February 09

గులాం నబీ ఆజాద్​పై మోదీ ప్రశంసలు

రాజ్యసభలో పదవీ విరమణ పొందనున్న నేతల వీడ్కోలు సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గులాం నబీ ఆజాద్​, మిర్​ మొహమ్మద్​ ఫయాజ్​, షాంసెర్​ సింగ్​, నజిర్​ అహ్మెద్​ లావయ్​ల సేవలను గుర్తు చేసుకున్నారు మోదీ. వారితో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. 

ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్​పై ప్రశంసలు కురిపించారు ప్రధాని. ఆజాద్​ స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి ఆయన పనితీరును అందుకోవటం చాలా కష్టమని తెలిపారు. ఆజాద్​.. తన పార్టీ కోసమే కాకుండా దేశం, పార్లమెంట్​ కోసం పని చేశారని కొనియాడారు.  

09:43 February 09

రాజ్యసభ సమావేశాలు

ఉత్తరాఖండ్​ చమోలీ జిల్లాలో హిమనీనదాలు విరిగిపడి జల విలయం సంభవించిన ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ఉదయం 11.30 గంటలకు రాజ్యసభలో ప్రకటన చేయనున్నారు. 

కేంద్ర ప్రభుత్వంలో సంయుక్త కార్యదర్శిని నేరుగా నియామకం చేయటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఎస్పీ ఎంపీ రామ్​ గోపాల్​ యాదవ్​ రాజ్యసభలో శూన్య గంట నోటీసులు ఇచ్చారు. అలాగే.. దిల్లీలో రైతుల ఆందోళనపై చర్చ చేపట్టాలని కోరుతూ 267 నిబంధన ప్రకారం రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చాయి డీఎంకే, సీపీఐ, ఆప్​, శివసేన పార్టీలు. పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్​ సుంకాలను తగ్గించాలని కోరుతూ కాంగ్రెస్​ ఎంపీ కేసీ వేణుగోపాల్​ శూన్య గంట నోటీసులు ఇచ్చారు.  

మరోవైపు.. సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో హిందీ సహా ఇతర భాషలను వినియోగించాలని డిమాండ్​ చేస్తూ.. రాజ్యసభలో శూన్య గంట నోటీసులు ఇచ్చారు భాజపా ఎంపీ హర్నాత్​ సింగ్​ యాదవ్​. 

Last Updated : Feb 9, 2021, 9:19 PM IST

ABOUT THE AUTHOR

...view details