ఆయుధ చట్ట సవరణ బిల్లు 2019కి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. సోమవారం లోక్‌సభ ఆమోదం పొందిన బిల్లును మూజువాణి ఓటుతో రాజ్యసభ నేడు ఆమోదించింది. అక్రమంగా ఆయుధాల తయారీ సహా అనుమతి లేకుండా అయుధాలను కలిగి ఉండేవారిపై కఠిన శిక్షలు విధించేలా బిల్లులో ప్రతిపాదనలు చేసింది ప్రభుత్వం. గరిష్ఠంగా జీవిత ఖైదు విధించేలా బిల్లులో ప్రతిపాదించారు.
ప్రస్తుతమున్న చట్టం ప్రకారం ప్రభుత్వ అనుమతి మేరకు ఓ వ్యక్తి గరిష్ఠంగా మూడు తుపాకులను ఉంచుకునేందుకు వీలుండగా తాజా బిల్లులో ఆ పరిమితిని రెండింటికి కుదించారు.