సమాచార హక్కు చట్టం సవరణ బిల్లు (ఆర్టీఐ)కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. విపక్షాల నిరసనల మధ్యే రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది. బిల్లుపై ఓటింగ్ జరగగా.. దాదాపు విపక్ష పార్టీలన్నీ వాకౌట్ చేశాయి.
తదుపరి పరిశీలన కోసం బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని పలువురు విపక్ష సభ్యులు అందజేసిన నోటీసులపై ఓటింగ్ జరిగింది. ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా 117, అనుకూలంగా 75 ఓట్లు వచ్చాయి.