మహారాష్ట్ర షోలాపూర్ జిల్లా పండర్పూర్లో చంద్రభాగా నది ఒడ్డున.. కొత్తగా నిర్మించిన కుంభార్ ఘాట్ గోడ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన వారు నలుగురు ఉన్నారు. భారీ వర్షంతో అక్కడ నిల్చున్న మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు షోలాపూర్ ఎస్పీ వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకున్న వీరందరినీ విపత్తు నిర్వహణ సిబ్బంది బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు వివరాలను వెల్లడించిన ఎస్పీ.. ఘటనపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం 2:30గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.
భారీ వర్షాలకు గోడ కూలి ఆరుగురు దుర్మరణం
వర్షాల కారణంగా మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. చంద్రభాగా నదీతీరంలోని కుంభార్ ఘాట్ గోడ కూలిన ఘటనలో ఆరుగురు మరణించారు. గాయపడిన మరికొందరిని ఆస్పత్రికి తరలించారు. భారీ వర్షపాతం వల్ల వరద ఉద్ధృతి పెరిగి ఈ ప్రమాదం జరిగింది.
కుంభార్ ఘాట్ గోడ కూలి ఆరుగురు మృతి
వర్షాల కారణంగా వరద ఉద్ధృతి పెరగడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
Last Updated : Oct 14, 2020, 9:54 PM IST