జమ్ముకశ్మీర్లో సర్పంచ్, వార్డు మెంబర్లకు పోలీసుల రక్షణ, 2 లక్షల బీమా సదుపాయం కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు.
జమ్ముకశ్మీర్ శ్రీనగర్ జిల్లా కుప్వారా, శ్రీనగర్ జిల్లా హర్వాన్ గ్రామ సర్పంచ్లు జునైద్, జుబేర్ నిషద్ భట్ అమిత్ షాను కలిశారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు.
స్పందించిన షా వారికి రక్షణతోపాటు 2లక్షల బీమా సదుపాయం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. మరో 15 నుంచి 20 రోజులలో మెుబైల్ సేవలు యథాతధంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.