తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అభినందనుడు పరమ వీరుడే' - మిగ్-21

వింగ్ కమాండర్ అభినందన్​కు దేశంలోని అత్యున్నత సైనిక పురస్కారం పరమవీరచక్ర ప్రకటించాలని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రధానిని కోరారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ అభినందన్ ఏమాత్రం నిబ్బరం కోల్పోలేదని శ్లాఘించారు.

అభినందన్​కు పరమ వీర చక్ర ఇవ్వాలని మోదీకి లేఖ రాసిన పళనిస్వామి

By

Published : Mar 8, 2019, 8:04 PM IST

వింగ్ కమాండర్ అభినందన్​ వర్ధమాన్​కు దేశంలోని అత్యున్నత సైనిక పురస్కారం పరమవీరచక్ర ప్రకటించాలని కోరారు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి. ఈమేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అభినందన్​ అమితమైన నిబ్బరం ప్రదర్శించారని పళనిస్వామి కితాబిచ్చారు.
పాక్ సైన్యానికి చిక్కి మార్చి 1న స్వదేశానికి చేరిన అభినందన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి.

అభినందన్​కు పరమ వీర చక్ర ఇవ్వాలని మోదీకి లేఖ రాసిన పళనిస్వామి

త్రివిధ దళాల్లో సేవలు అందిస్తూ అసాధారణ ధైర్య సాహసాల్ని ప్రదర్శించినవారికి పరమవీర చక్ర అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. భూతలం, సముద్రం, గగనతలాల్లో వీరోచితంగా పోరాడి అసువులు బాసినా ఈ అవార్డు ప్రకటిస్తారు.

ఫిబ్రవరి 27న భారత గగనతలంలోకి చొరబడ్డ పాక్​ యుద్ధ విమానాల్ని అభినందన్​ మిగ్​-21 ఫైటర్​ జెట్​తో నిలువరించారు. పొరుగు దేశంతో జరిగిన పోరులో ఆయన నడుపుతున్న యుద్ధ విమానం కూలింది. పారాచూట్​ సాయంతో పాక్​ భూభాగంలో దిగిన ఆయన్ను ఆ దేశ​ సైన్యం అదుపులోకి తీసుకుంది. అంతర్జాతీయ ఒత్తిళ్లతో వెనక్కి పంపింది.

ABOUT THE AUTHOR

...view details