తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్ దుర్నీతి... నియంత్రణ రేఖ వెంట గ్రామాలపై దాడులు

జమ్ముకశ్మీర్​ పూంచ్ సెక్టార్​లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ సైన్యం దాడులు చేస్తోంది. సైనిక పోస్టులు, సమీప గ్రామాలే లక్ష్యంగా మోర్టార్లు ప్రయోగిస్తోంది. భారత భద్రతా దళాలు పాక్ దాడులను దీటుగా తిప్పికొడుతున్నాయి.

పాక్ దుర్నీతి... నియంత్రణ రేఖ వెంట గ్రామాలపై దాడులు

By

Published : Sep 14, 2019, 12:41 PM IST

Updated : Sep 30, 2019, 1:49 PM IST

పాక్ దుర్నీతి... నియంత్రణ రేఖ వెంట గ్రామాలపై దాడులు

పాకిస్థాన్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. జమ్ము కశ్మీర్​ పూంచ్​ సెక్టార్లో​ నియంత్రణరేఖ వెంబడి ఉన్న సైనికుల పోస్టులపై, సమీప గ్రామాలపై మోర్టార్లతో దాడులు చేస్తోంది.

పాక్ సైన్యం ఇవాళ ఉదయం 10 గంటల నుంచి బాలాకోట్​, మాంకోట్​ ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో కాల్పులకు పాల్పడుతోంది. ఈ దాడులను భద్రతా దళాలు దీటుగా తిప్పికొడుతున్నాయి.

స్థానికులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని డిప్యూటీ కమిషనర్ రాహుల్ యాదవ్​​ తెలిపారు. భద్రత కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వారికి సూచించామని వెల్లడించారు.

ఇదీ చూడండి:భారత భద్రతా దళాలకు తెల్ల జెండా చూపిన పాక్​

Last Updated : Sep 30, 2019, 1:49 PM IST

ABOUT THE AUTHOR

...view details