పాకిస్థాన్ బలగాలు మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. శనివారం ఉదయం జమ్ముుకశ్మీర్ పూంఛ్ జిల్లా నియంత్రణ రేఖ వెంబడి మోర్టార్లతో విరుచుకుపడ్డాయి పాక్ బలగాలు. చిన్నపాటి ఆయుధాలతో కాల్పులకు పాల్పడ్డాయి. పాక్ చర్యలకు భారత సైన్యం దీటుగా బదులిచ్చింది.
రక్షణ మంత్రి పర్యటన రోజే పాక్ కాల్పులు - CEASEFIRE
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్ పూంఛ్ జిల్లా సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంబడి మోర్టార్లు ప్రయోగించాయి పాక్ బలగాలు.
రక్షణ మంత్రి పర్యటన రోజే పాక్ కాల్పులు
పాక్ సైన్యం కాల్పులకు సరిహద్దు ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు.
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఈ సమయంలోనే పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడడాన్ని తీవ్రంగా పరిగణించాయి భారత బలగాలు.