కశ్మీర్ తమ అంతర్గత విషయమనీ, అందులో పాకిస్థాన్ అనవసరంగా జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది భారత్. వాస్తవాలను పాక్ అంగీకరించతప్పదని తేల్చి చెప్పింది. ఇతర దేశాలకు కశ్మీరు అంశంపై భారత్ వివరిస్తోంది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ స్పందించారు.
"కశ్మీరుపై వాస్తవాన్ని పాకిస్థాన్ అంగీకరించాలి. ఈ విషయంలో ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించడం మానుకోవాలి. ద్వైపాక్షిక సంబంధాలపై అత్యంత భయానక దృశ్యాన్ని చూపించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది. జమ్ముకశ్మీరులో అభివృద్ధి జరిగితే.. అప్పుడెవరినీ మభ్యపెట్టలేమని పాక్ భావిస్తోంది. అందుకే కశ్మీర్ విషయంలో భారత్ నిర్ణయంపై పాక్ నైరాశ్యంతో ఉంది."
- రవీశ్ కుమార్, భారత విదేశాంగ శాఖ
ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ తీసుకున్న చర్యలన్నీ ఏకపక్షమేనని స్పష్టం చేశారు.