తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండు నెలల్లో భారత్​తో యుద్ధం: పాక్ రైల్వే మంత్రి

జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి రద్దు అనంతరం భారత్​పై ఏదో ఒక రూపంలో అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది పాకిస్థాన్. ఇప్పడు ఆ దేశ రైల్వే శాఖ మంత్రి నోటి దురుసు ప్రదర్శించారు. వచ్చే రెండు నెలల్లో ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశముందని బెదిరించే ప్రయత్నం చేశారు.

రెండు నెలల్లో భారత్​తో యుద్ధం: పాక్ రైల్వే మంత్రి

By

Published : Aug 28, 2019, 6:35 PM IST

Updated : Sep 28, 2019, 3:25 PM IST

జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేశాక గందరగోళానికి గురైన పాకిస్థాన్ ఏదో ఒక రూపంలో భారత్‌ను ఎండగట్టాలనే చూస్తోంది. తాజాగా ఆ దేశ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్.. అక్టోబరు, నవంబరులో ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయిలో యుద్ధం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. రావల్పిండిలో ఓ సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారాయన. ఇరు దేశాల మధ్య ఇదే ఆఖరు యుద్ధం అవుతుందని నోటి దురుసు ప్రదర్శించారు రషీద్​.

తాము కశ్మీర్‌ ప్రజల పక్షాన నిలబడతామని మోదీ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా పోరాడతామన్నారు రషీద్​. ఇప్పటికీ భారత్‌తో చర్చల గురించి ఆలోచించే వారు తెలివితక్కువ వారేనని అన్నారు.

ఇటీవలే భారత్, పాక్‌ మధ్య అణు యుద్ధం వస్తే ఎవరూ మిగలరని పాక్‌ ప్రధాని హెచ్చరించగా.. కశ్మీరీల హక్కుల కోసం ఎంత వరకైనా వెళ్తామని పాక్‌ విదేశాంగ మంత్రి ఖురేషి వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: కరాచీలోని 3 గగనతలాల్ని మూసేసిన పాకిస్థాన్

Last Updated : Sep 28, 2019, 3:25 PM IST

ABOUT THE AUTHOR

...view details